కోడి పందేలపై దాడి.. 10 మంది అరెస్ట్

కోడి పందేలపై దాడి.. 10 మంది అరెస్ట్

నెల్లూరు రూరల్ సజ్జాపురం గ్రామం శివారు ప్రాంతంలో గుట్టు చప్పుడు కాకుండా కొందరు కోళ్ల పందేలు నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ వేణు తన సిబ్బందితో ఆకస్మిక దాడులు చేశారు. దాడుల్లో పదిమంది జూదరులను అరెస్ట్ చేశారు. రూ.6,820 నగదు, నాలుగు కోళ్లు, ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.