'సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలకు తరలిరావాలి'

రంగారెడ్డి: ఆమనగల్ పట్టణ కేంద్రంలో సోమవారం ఉదయం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పాపన్న గౌడ్ యువజన సంఘం గౌరవ అధ్యక్షుడు గుండ్రావతి నరేష్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రతి గౌడ సంఘం నాయకులు, ప్రజలు, తదితరులు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు.