రేపాల పీహెచ్‌సీలో సాధారణ ప్రసవం
SRPT: మునగాల మండల పరిధిలోని రేపాల పీహెచ్‌సీలో ఇవాళ వైద్యులు గర్భిణికి సుఖ ప్రసవం చేశారు. జగన్నాథపురాకి చెందిన లక్ష్మీ భవానీకి నొప్పులు రావడంతో పీహెచ్‌సీకి తరలించారు. వైద్యాధికారి డా. వినయ్ కుమార్ నేతృత్వంలో సిబ్బంది సాధారణ ప్రసవం చేయగా తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. కాగా, ప్రభుత్వ ఆసుపత్రిలో సుఖ ప్రసవాల సంఖ్య పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తున్న విషయం తెలిసిందే.