VIDEO: బేతిగల్లో ఘనంగా భూలక్ష్మీ బ్రహ్మోత్సవాలు
KNR: వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో భూలక్ష్మీ, మహాలక్ష్మీ, పోచమ్మ దేవతల ప్రతిష్ఠాపన ప్రథమ వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం రెండోరోజు వేడుకల్లో భాగంగా అర్చకులు నరసింహచార్యుల ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యహవాచనం, రక్షాబంధనం, అంకురార్పణ, మండప ఆరాధన వంటి ప్రత్యేక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు.