ఆశ్రమం నుంచి తప్పిపోయిన దివ్యాంగుడి అప్పగింత
హనుమకొండ: కాజీపేట మండల కేంద్రంలోని హౌస్ ఆఫ్ జాయ్ మానసిక వికలాంగుల ఆశ్రమం నుంచి 15 రోజుల క్రితం తప్పిపోయిన వ్యక్తిని పోలీసులు గుర్తించి ఆశ్రమ నిర్వాహకులకు ఇవాళ అప్పగించారు. ఎస్ఐ లవన్ కుమార్ దివ్యాంగుడిని గుర్తించి ఆశ్రమానికి చేర్చారు. ఈ మేరకు నిర్వాహకులు ఎస్ఐ, పోలీస్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.