VIDEO: భక్తులతో కిక్కిరిసిన రావులపాలెం బస్టాండ్
కోనసీమ: ఆత్రేయపురం వాడపల్లి వెంకన్న దర్శనానికి వెళ్లే భక్తులతో రావులపాలెం ఆర్టీసీ బస్టాండ్ శనివారం ప్రయాణికులతో కిక్కిరిసింది. కార్తీక మాసం శనివారం కావడంతో మహిళా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉచిత బస్సు పథకం ప్రభావం వల్ల జనం అధికంగా రావడంతో సరిపడా బస్సులు లేక సీట్లు కోసం మహిళలు ఎగబడ్డారు.