జేసీపీ నడిపిన మంత్రి
EG: పెరవలి మండలంలోని కానూరు–ఉసులుమర్రు సీసీ రహదారి నిర్మాణ పనులను కొబ్బరికాయ కొట్టి మంత్రి కందుల దుర్గేష్ ఆదివారం ప్రారంభించారు. సుమారు రూ. 3 కోట్లు వ్యయంతో చేపట్టిన ఈ రహదారి ఎన్నో ఏళ్లుగా రాకపోకల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపనుందని వెల్లడించారు. కొంత దూరం జేేసీపీని నడిపి ఉత్సాహపరిచారు. పనులను త్వరితగతిన నాణ్యతతో పూర్తి చేయాలన్నారు.