'పోగొట్టుకున్న నగలను బాధితురాలికి అందజేసిన పోలీసులు'

'పోగొట్టుకున్న నగలను బాధితురాలికి అందజేసిన పోలీసులు'

BHPL: భూపాలపల్లి మండలం దీక్షకుంట గ్రామానికి చెందిన పక్కల రాజమ్మ ఇవాళ బ్యాంకుకు వెళ్తుండగా పర్సులోని బంగారు నగలను పోగొట్టుకున్నారు. అయితే రాజమ్మ BHPL పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో చాకచక్యంగా వ్యవహరించి నగలను గుర్తించి రికవరీ చేశారు. ఇవాళ సాయంత్రం బాధితురాలికి నగలను అప్పగించారు. పోలీసుల కృషిని స్థానికులు అభినందించారు.