ప్రణాళికంగా విధులను నిర్వహించాలి: కలెక్టర్
NLR: అప్పగించిన విధులను చిత్తశుద్ధితో నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్సులో ఎస్ఎస్సీ 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక, ఎస్ఎస్సీ విద్యార్థుల దీర్ఘకాల గైర్హాజరు వారికి రెసిడెన్షియల్ శిబిరాలు, పాఠశాలల్లో సివిల్ పనుల స్థితి, అక్షర ఆంధ్ర, వన్ మంత్ ఫోర్ విజిట్స్ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.