మోదీ-ట్రంప్ ఫోన్‌కాల్ మధ్యలో మస్క్.. కేంద్రం క్లారిటీ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో టెస్లా అధినేత మస్క్ కూడా పాల్గొన్నట్లు వస్తున్న వార్తలపై కేంద్రం స్పందించింది. ఈ వార్తలను కేంద్రం తోసిపుచ్చింది. మార్చి 24న మోదీ, ట్రంప్ మాత్రమే ఫోన్‌లో మాట్లాడినట్లు తేల్చి చెప్పింది. ఇరు నేతలు పశ్చిమాసియా ఉద్రిక్తతలపై చర్చించినట్లు పేర్కొంది. మస్క్ ఉన్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని తెలిపింది.