రేవంత్ రెడ్డికి కేరళ సీఎం బహిరంగ లేఖ

రేవంత్ రెడ్డికి కేరళ సీఎం బహిరంగ లేఖ

కేరళ, తెలంగాణ సీఎంల మధ్య సోషల్ మీడియా వేదికగా సాగుతున్న మాటల యుద్ధం ముదిరింది. కేరళ ప్రభుత్వ పనితీరుపై రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు స్పందిస్తూ, కేరళ సీఎం పినరయి విజయన్ బహిరంగ లేఖ విడుదల చేశారు. రాజకీయ విబేధాలను పరిష్కరించుకోవడానికి వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని ఆయన రేవంత్‌కు హితవు పలికారు.