రోలుగుంటకు 19,995 స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

AKP: రోలుగుంట మండలానికి 19,995 స్మార్ట్ రేషన్ కార్డులు మంజూరైనట్లు శనివారం సాయంత్రం MRO నాగమ్మ చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్మార్ట్ కార్డుల ద్వారా రేషన్ సరకుల పంపిణీ మరింత సులభంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఈనెల 15న ఎమ్మెల్యే రాజు గుండుబాడు, జె.నాయుడుపాలెం గ్రామాల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభించనున్నారని ఆమె తెలిపారు.