‘రామాయణ’ సినిమాపై సీఎం ప్రశంసలు

రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి కాంబోలో తెరకెక్కుతున్న 'రామాయణ' చిత్రంపై మహారాష్ట్ర CM దేవేంద్ర ఫడ్నవీస్ ప్రశంసలు కురిపించారు. ముంబైలో జరిగిన 'WAVES 2025' సదస్సులో ఈ మూవీ గ్లింప్స్‌ను ఆయన చూశారు. 'గ్లింప్స్ నాణ్యతను చూసి ఆశ్చర్యపోయాను, ఇది ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలుస్తుంది. ఇలాంటి సినిమాలు కొత్త తరానికి మన కథలను చెప్పడానికి ఉత్తమ మార్గం' అని అన్నారు.