పొట్టి శ్రీరాములుకు మంత్రి ఫరూక్ నివాళి

పొట్టి శ్రీరాములుకు మంత్రి ఫరూక్ నివాళి

NDL: పొట్టి శ్రీరాములు త్యాగంతోనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని మంత్రి ఫారుక్ పేర్కొన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా నంద్యాల సంజీవనగర్ గేటులోని ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ రాజకుమారితో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఆయనే కారణమని మంత్రి తెలిపారు. పొట్టి శ్రీరాములు జీవితం భావితరాలకు ఆదర్శమని కొనియాడారు.