ముంబై చేరుకున్న టీమిండియా
T20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈనెల 5న సెమీఫైనల్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా సభ్యులు తాజాగా ముంబై చేరుకున్నారు. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టు వెలుపల అభిమానులు భారీగా తరలివచ్చి.. భారత క్రికెటర్లను తమ కెమెరాల్లో బంధించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.