అగ్ని ప్రమాదాల పట్ల నిర్లక్ష్యం వహించరాదు

గుంటూరు: అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు నిర్లక్ష్యం వహించరాదని బాపట్ల అగ్నిమాపక శాఖ అధికారి వెంకటేశ్వరరావు చెప్పారు. ఆదివారం బాపట్ల అగ్నిమాపక శాఖ కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. బాపట్ల లోని పలు పాఠశాలల విద్యార్థులకు అగ్ని ప్రమాదాల సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.