వరి కోతలు వాయిదా వేయాలని రైతులకు సూచన
ప్రకాశం: దర్శి మండలంలోని పసుపుగల్లులో జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసులు, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీడీవో శ్రీదేవి కలిసి సోమవారం వరి ధాన్యం కుప్పలను పరిశీలించారు. దిత్వా తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని, వరి మొక్కజొన్న పంటల కోతలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని రైతులకు సూచించారు. ఇప్పటికే కోసిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు.