వివాహిత అదృశ్యంపై కేసు నమోదు

E.G: కొవ్వూరు మండలానికి చెందిన ఓ వివాహిత అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు కొవ్వూరు రూరల్ ఎస్ఐ శ్రీహరి తెలిపారు. బుధవారం ఇంటినుంచి బయటకు వెళ్లిన వివాహిత తిరిగి ఇంటికి రాలేదు. దీంతో చుట్టు ప్రక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీహరి తెలిపారు.