RTC కార్మికులతో చర్చలకు సిద్ధం: మంత్రి

RTC కార్మికులతో చర్చలకు సిద్ధం: మంత్రి

TG: ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రేపు, ఎల్లుండి కార్మికులు ఎప్పుడు వచ్చినా చర్చిస్తామని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం.. ప్రయాణికుల సౌకర్యం కోసం RTC సంస్థ పనిచేస్తోందని అన్నారు. పదేళ్లుగా RTC నిర్వీర్యమైందని, ఇప్పుడిప్పుడే లాభాలబాటలో పయనిస్తోందని వెల్లడించారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కార్మికులు సహకరించాలని కోరారు.