మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేసిన డీఎస్పీ

కృష్ణా: మత సామరస్యం వెల్లివిరియాలని డీఎస్పీ తాళ్లూరి విద్యశ్రీ అన్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం చల్లపల్లిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ముస్లిం మత పెద్దల చేతుల మీదుగా 400ల మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా ప్రజల్లో లౌకిక భావన, సమైక్యత పరివ్యాప్తి కావాలని కోరారు. సీఐ కే.ఈశ్వరరావు, ఎస్సై సుబ్రహ్మణ్యం, షేక్ నసీం ఘోరీ, సీఐటీయూ మండల కార్యదర్శి కరీముల్లా పాల్గొన్నారు.