సప్లమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల

సప్లమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల

WNP: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 13 నుంచి ప్రారంభం కానున్నాయని డీఐఈవో ఎర్ర అంజయ్య తెలిపారు. రేపటి నుంచి ఏప్రిల్ 20 వరకు కళాశాలల్లో ఫీజు చెల్లించవచ్చన్నారు. మే 22 నుంచి ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. పరీక్షలు రెండు సెషన్లలో జరుగుతాయని, మరిన్ని వివరాలకు సంబంధిత కళాశాలల్లో సంప్రదించాలని ఆయన సూచించారు.