VIDEO: దంత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

తూ.గో: అనపర్తి మండలం పొలమూరులో జిఎస్ఎల్ హాస్పిటల్స్, నల్లమిల్లి మూలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా దంత వైద్య శిబిరాన్ని ఆదివారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా దంత సమస్యలు ఉన్నవారిని పరామర్శించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 3 రోజులపాటు జరిగే దంత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.