పాలకవర్గాన్ని నిలదీసిన ప్రతిపక్ష కార్పొరేటర్లు

పాలకవర్గాన్ని నిలదీసిన ప్రతిపక్ష కార్పొరేటర్లు

BDK: కొత్తగూడెం కార్పొరేషన్ సాధారణ సమావేశంలో ప్రతిపక్ష కార్పొరేటర్లు సోమవారం పాలకవర్గాన్ని నిలదీశారు. పారిశుద్ధ్య కార్మికుల వేతనాల్లో వ్యత్యాసాలపై మండిపడ్డారు. పాల్వంచలో రూ. 20,460 ఇస్తుంటే, కొత్తగూడెం, సుజాతనగర్ కార్మికులకు రూ. 19,298 ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. 60 డివిజన్లకు 96 స్వచ్ఛ ఆటో డ్రైవర్లు ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు.