భూభారతిపై అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్

MHBD: తొర్రూరు మండల కేంద్రంలోని రైతువేదికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన భూభారతి - చట్టం 25పై ఇవాళ రెవెన్యూ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులకు భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై అవగాహన కల్పించారు. రైతులు చట్టాలను సద్వినియోగపరచుకోవాలని కోరారు.