మంగళగిరిలో నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్
GNTR: మంగళగిరి పట్టణ పరిధిలోని పలు ప్రాంతాల్లో మరమ్మతుల కారణంగా ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈఈ జి. సురేష్ బాబు తెలిపారు. టిప్పర్ల బజార్, మన్యం బజార్, మార్కండేయ కాలనీతో పాటు నులకపేట పరిధిలోని అన్నా క్యాంటీన్, ఇండస్ట్రియల్ కాలనీ, శివదుర్గపురం వంటి ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు.