సింహాచలం వరకు డబుల్ డెక్కర్ సర్వీసులు
AP: విశాఖ పర్యాటక రంగాన్ని మరింత పెంపొందించే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. నగరంలో పర్యాటక ఆకర్షణగా ప్రవేశపెట్టిన డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను సింహాచలం వరకు పొడిగించింది. పర్యాటకులు సాగర తీర అందాలను వీక్షించేందుకు ప్రవేశపెట్టిన ఈ బస్సులకు అనూహ్య స్పందన లభించడంతో.. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఈ సేవలను మరింత విస్తరించింది.