మహాత్మ జ్యోతిరావు పూలేకు ఘనంగా నివాళులు
SKLM: సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే సేవలు ఎనలేనివని హెచ్ఎం. మాధవరావు తెలిపారు. ఇవాళ మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా జలుమూరు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. అంటరానితనం, కుల వివక్ష పట్ల అవిశ్రాంత పోరాటం చేపట్టారని తెలియజేశారు. ఆయన చేసిన సేవలు ఎందరికో ఆదర్శవంతమని పేర్కొన్నారు.