అనునిత్యం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు: కాంగ్రెస్ నేతలు
HNK: మంత్రి పొన్నం ప్రభాకర్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయంలో స్థానిక కాంగ్రెస్ నేతలు, ప్రతినిధులు పూజలు నిర్వహించారు. అనంతరం నేతలు కేక్ కట్ చేశారు. అనునిత్యం హుస్నాబాద్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి ప్రదాన లక్ష్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పనిచేస్తున్నారని నేతలు అన్నారు. నేతలు కనకయ్య, వెంకటేష్, సమ్మయ్య, శ్రీనివాస్ ఉన్నారు.