పెద్దవంగర: ఓటింగ్ శాతం పెంచేలా స్వీప్ కార్యక్రమాలు

వరంగల్: పెద్దవంగర మండల M.R.O మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వీప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా M.R.O ఓటు ప్రాముఖ్యతను వివరిస్తూ.. ఓటు బలమైన ప్రజాస్వామ్యానికి నాంది అని పేర్కొన్నారు. సరియైన అభ్యర్థికి ఓటు వేసి మెరుగైన సమాజం కోసం కృషి చేయాలని కోరారు.