ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
VZM: పూసపాటిరేగ మండలం వెంపడం గ్రామంలో ఇవాళ ఉచిత పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే లోకం మాధవి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాడి రైతుల అభివృద్ధి, పశుసంవర్ధక రంగ బలోపేతమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే, రైతులు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.