VIDEO: ప్రారంభమైన మెరక తల్లి వారోత్సవాలు
VZM: మెరకముడిదాం, సోమలింగాపురం, ఎంపాలెం మూడు గ్రామాల గ్రామ దేవత మెరకతల్లి అమ్మవారి వారోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో మూడు గ్రామాల్లో అమ్మవారు ఘటాలు ఊరేగించారు. వాయిద్యాలు, డప్పుల శబ్దాలతో అమ్మవారి ఘటాలను ఆలయం నుంచి మూడు గ్రామాల్లో ఊరేగించినట్లు ఆలయ కమిటీ తెలిపింది.