ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్
SRD: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ 08455-276155 ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్న కంట్రోల్ రూమ్ నంబర్‌కు ఫోన్ చేస్తే సమాచారం ఇస్తారని చెప్పారు. ఎన్నికల నిబంధన ఉల్లంఘనలు కూడా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.