కథలాపూర్‌లో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ

JGL: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా మంగళవారం కథలాపూర్ మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగుర వేయాలని కోరారు. కార్యక్రమంలో మారుతి, సురేందర్ రావు, వెంకటేష్, శ్రీనివాస్, మహేష్, అంజయ్య, సునీల్, శివ, ప్రతాప్, జీవన్ రెడ్డి, రవీందర్, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.