గుంటూరు పరిధిలో భారీ వర్షం

GNTR: గుంటూరులోని కొత్తపేటలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా వర్షం కురిసింది. ఈ వానతో వాహనదారులు, ప్రజలు, వీధి వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. అయితే ఉదయం నుంచి ఉన్న ఎండ, ఉక్కపోత నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభించినట్లైంది. ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుండటంతో పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.