కృష్ణ నదిలో దూకి మహిళ ఆత్మహత్య
BPT: పెనుమూడి పులిగడ్డ బ్రిడ్జి పైనుంచి కృష్ణానదిలో దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. గమనించిన మత్స్యకారులు వెంటనే స్పందించి, ఆమెను ఒడ్డుకు చేర్చారు. రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలు రేపల్లె పట్టణంలోని 5వ వార్డుకు చెందిన గరికపాటి రమాదేవి(29)గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.