హైవేపై పసికందు మృతదేహం లభ్యం
ADB: జిల్లాలోని హైవేపై ఓ మగ పసి కందు మృతదేహం లభ్యమైన అమానుష ఘటన స్థానికంగా కలకలం రేపింది. గుడిహత్నూర్ మండల సమీపంలో జాతీయ రహదారి పక్కన పడి ఉన్న పసి కందు మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.