VIDEO: 'గుంటూరుకు నాలుగు నూతన బస్సులు ఏర్పాటు'

ప్రకాశం: దర్శిలో మంగళవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద పొదిలి డిపో మేనేజర్ శంకర్రావు ప్రయాణికులకు పలు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొదిలి డిపో నుండి దర్శి మీదుగా గుంటూరు వెళ్ళేందుకు నాలుగు నూతన బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేకాక దర్శి బస్టాండ్ పరిధిలో గల సౌకర్యాలను పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులో ఉంచుతానని పేర్కొన్నారు.