మానసిక వికలాంగులకు సేవ చేయటం మంచి పరిణామం: ఎస్పీ
SKLM: అనాథ మానసిక వికలాంగుల సేవలో మనోబంధు ఫౌండేషన్ పనిచేయడం శుభ సూచికమని ఎస్పీ మహేశ్వర రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇవాళ మనో బంధు అంబులెన్స్‌ను ఆయన పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. రెడ్‌క్రాస్ సొసైటీతో కలిసి పనిచేస్తూ అత్యవసర సమయాల్లో మానసిక వికలాంగుల కోసం పనిచేయడం ముఖ్యమన్నారు.