VIDEO: సీఎంపై ఆటో డ్రైవర్లు ఆగ్రహం..!
HYD: యుద్ధం కారణంగా రాష్ట్రంలో పెరిగిన ఇంధన ధరలు CM రేవంత్ రెడ్డికి సెగలు పుట్టిస్తున్నాయి. ధరల పెరుగుదలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆటో డ్రైవర్లు, 'రేవంత్ రెడ్డి.. నువ్వు ఇంకెప్పుడూ HYDలో కనిపించవ్' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. నీలాంటి వాళ్లు ఎంతోమంది వచ్చి వెళ్లారని, సామాన్యుల కడుపు కొడితే ప్రభుత్వం నిలబడదని హెచ్చరిస్తున్నారు. ఆటో డ్రైవర్ల శాపనార్థాల మధ్య పాలన సాగించడం కష్టమని మండిపడుతున్నారు.