అనారోగ్యంతో కార్మికుడు మృతి.. ఆర్థిక సాయం అందజేత

అనారోగ్యంతో కార్మికుడు మృతి.. ఆర్థిక సాయం అందజేత

BHPL: భూపాలపల్లి మండలం కొంపల్లి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికుడు పచ్చయ్య సోమవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందాడు. గ్రామ పంచాయతీ నుంచి అతడి దహన సంస్కారాల కోసం రూ.10,000 ఆర్థిక సాయాన్ని భూపాలపల్లి ఎంపీడీవో నాగరాజు చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పెంచాల లింగయ్య, కారొబార్, సిబ్బంది పాల్గొన్నారు.