ప్రకృతి వ్యవసాయంపై అవగాహన
VSP: పద్మనాభం మండలం శెర్కండం గ్రామంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ శ్యామల రైతులకు హాఫ్ మూన్, డ్రాట్ ప్రూఫింగ్ మోడళ్లపై వివరించారు. అలాగే, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, కరువు పరిస్థితుల్లో తక్కువ ఖర్చుతో పంటల సాగు వంటి ప్రయోజనాలను వివరించారు.