డిజిటల్ అరెస్ట్ మోసాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: ఎస్సై
WGL: డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వర్ధన్నపేట ఎస్సై సాయిబాబు సూచించారు. పోలీస్, CBI అధికారులమని నటిస్తూ మోసగాళ్లు ఫోన్ చేసి అక్రమ కేసులు అంటూ భయపెట్టి ఆన్‌లైన్‌లో డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. నిజమైన పోలీసులు ఎప్పుడూ డబ్బులు అడగరని తెలిపారు. ఇలాంటి కాల్స్ వస్తే కట్ చేసి, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలన్నారు.