'బీ.ఆర్ నాయుడిని ఛైర్మన్ పదవి నుంచి తొలగించాలి'
E.G: టీటీడీ ఛైర్మన్ పదవికి కళంకం తెచ్చిన బి.ఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలని మాజీ హోంమంత్రి, గోపాలపురం వైసీపీ ఇంఛార్జ్ తానేటి వనిత డిమాండ్ చేశారు. శనివారం నల్లజర్ల గ్రామంలోని శ్రీ రామకృష్ణ భక్త మందిరం వద్ద వైసీపీ శ్రేణులతో నిరసన తెలిపారు. అనైతిక కార్యకలాపాలు చేస్తూ, వివాదాస్పద వ్యవహార శైలితో బీఆర్ నాయుడు టీటీడీ పవిత్రతను దెబ్బతిస్తున్నారన్నారు.