ముంబైలో ఫైనల్.. భారత్‌పైనే ఒత్తిడి: సౌతాఫ్రికా

ముంబైలో ఫైనల్.. భారత్‌పైనే ఒత్తిడి: సౌతాఫ్రికా

నవీ ముంబై వేదికగా తమతో ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ ఆడనున్న భారత్‌కు ఫ్యాన్స్ మద్దతుతోపాటు తీవ్ర ఒత్తిడి ఉంటుందని సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ అభిప్రాయపడింది. భారత్ గెలవాలని వారిలో ఎన్నో అంచనాలు ఉండటమే అందుకు కారణమని, అదే తమకు కలిసి రావొచ్చని పేర్కొంది. ఫైనల్‌లో ఆడేందుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామంది.