బాధిత కుటుంబాలకు వైసీపీ ఇంఛార్జీ పరామర్శ
ELR: యలమంచిలి మండలం కట్టావారిపాలేనికి చెందిన కప్పల సునీల్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న పాలకొల్లు వైసీపీ ఇంఛార్జీ గుడాల గోపి బుధవారం ఆయన ఇంటికి వెళ్లి బాధిత కుటుంబీకులను పరామర్శించారు. ఆయన వెంట డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ తాతాజీ, భాస్కర్ రావు, శ్రీను బాబు, వాసు, కృష్ణాజీ, తదితరులు పాల్గొన్నారు.