హెల్త్ కేర్ డిప్లొమా పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

NLR: ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 2025-26 సం.గాను హెల్త్ కేర్ డిప్లొమా పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. లోకల్ అభ్యర్థులకు 85%, నాన్ లోకల్ అభ్యర్థులకు 15% సీట్లు కేటాయిస్తామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 8వ తేదీలోగా దరఖాస్తులను మెడికల్ కళాశాలలో అందజేయాలన్నారు.