విద్యార్థిని మృతి పై విచారణ జరిపించాలి

HNK: పరకాల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆత్మహత్య చేసుకుని మరణించిన 10తరగతి విద్యార్థిని శ్రావణి మృతిపై విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని స్వేరోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కందికట్ల ప్రవీణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం పర్వతగిరి మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ..విద్యార్థిని మరణంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.