నామినేషన్ స్వీకరణ కేంద్రాలను సందర్శించిన అదనపు DCP
KMM: గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ సెంటర్‌ను అదనపు DCP (లా&అర్డర్) ప్రసాద్ రావు సందర్శించారు. రఘునాధపాలెం, కోయచిలక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎన్నికల సిబ్బందితో మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు నిర్వహించాలని పోలీస్ అధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరు ఎన్నికల ప్రవర్తన నియమావళి తప్పకుండా పాటించాలన్నారు.