ఉత్సాహంగా ఓట్లేస్తున్న వృద్ధులు, దివ్యాంగులు

ఉత్సాహంగా ఓట్లేస్తున్న వృద్ధులు, దివ్యాంగులు

TG: తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. వృద్ధులు, దివ్యాంగులు సైతం ఉత్సాహంగా ఓట్లు వేస్తున్నారు. ఆటోలో, వీల్ ఛైర్లపై వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహబూబ్ నగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పరిధిలోని పంచాయతీలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు.