FSO కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
ADB: నార్నూర్ మండలం గుంజాల (బొజ్జు గూడ) ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఇటీవల గుండె పోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆయన స్వగృహం గుంజాలలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.